Jump to content

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం
స్థాపితం2008 (2008)
ఛాన్సలర్సీ.పీ. రాధాకృష్ణన్ (తెలంగాణ గవర్నర్)
వైస్ ఛాన్సలర్జయేష్ రంజన్, ఐఏఎస్ (ఇంచార్జ్ వీసీ)
చిరునామమాసబ్ ట్యాంక్, హైదరాబాదు, తెలంగాణ, 500028, భారతదేశం
17°24′10″N 78°27′17″E / 17.4029113°N 78.454711°E / 17.4029113; 78.454711
కాంపస్పట్టణ

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో ఉన్న ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. ఇందులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే రెండు కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్.డి పరిశోధన కోర్సులను అందిస్తున్నాయి.

చరిత్ర

[మార్చు]

1940లో హైదరాబాద్ రాష్ట్రంలోని కళలు, స్థానిక హస్తకళలను ప్రోత్సహించడానికి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కళాశాలగా స్థాపించబడింది. 1972 అక్టోబరులో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ స్థాపించడంతో ఈ కళాశాల విశ్వవిద్యాలయంతో విలీనం చేయబడింది. ఆ విశ్వవిద్యాలయ రాజ్యాంగ కళాశాలగా మారింది.[1] 2014 తరువాత తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో "గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్"గా అభివృద్ధి చెందింది.

కోర్సులు

[మార్చు]

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్చర్, డిజైన్ & ప్లానింగ్ కోసం డిజిటల్ టెక్నిక్స్, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ప్లానింగ్ మొదలైన కోర్సులను అందిస్తోంది. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రకళ, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, శిల్పకళ మొదలైన కోర్సులు అందించబడుతున్నాయి.

అనుబంధ సంస్థలు

[మార్చు]

కింది విద్యా సంస్థలు జేఎన్‌ఏఎఫ్‌ఏయూకి అనుబంధంగా ఉన్నాయి:[2]

  • అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, హైదరాబాద్
  • ఐకాట్ డిజైన్ & మీడియా కళాశాల, హైదరాబాద్
  • క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, హైదరాబాద్[3]
  • సిఎస్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సికింద్రాబాద్
  • ఎస్ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆగిరిపల్లి
  • శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
  • మాస్ట్రో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
  • వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, హైదరాబాద్
  • మాస్టర్జీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విజయవాడ ఏపీ
  • డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్, హైదరాబాద్
  • వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, విశాఖపట్నం
  • స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్, జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, సికింద్రాబాద్.
  • జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్, హైదరాబాద్
  • లుంబినీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ & టౌన్ ప్లానింగ్, అనంతరామ్ ఏపి

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About us". Jawaharlal Nehru Architecture and Fine Arts University. Archived from the original on 2017-12-08. Retrieved 2022-09-05.
  2. "Affiliated Colleges". Jawaharlal Nehru Architecture and Fine Arts University. Archived from the original on 2017-11-23. Retrieved 2022-09-05.
  3. https://www.jnafau.ac.in/affiliated-colleges-vad/