Jump to content

జయం మనదే (1956 సినిమా)

వికీపీడియా నుండి
జయం మనదే
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
ఆర్.నాగేశ్వరరావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
సంగీతం ఘంటసాల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
భాష తెలుగు

జయం మనదే చిత్రంలో ప్రతాప్ గా నందమూరి తారక రామారావు, రాజుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, మంత్రిగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆయన కూతురుగా అంజలీదేవి, ప్రచండుడుగా ఆర్.నాగేశ్వరరావు నటించారు. మిగిలిన పాత్రల్లో రేలంగి, జానకి, పెరుమాళ్ళు కనిపించారు. ఈ చిత్రానికి ముద్దుకృష్ణ మాటలు రాయగా, కొసరాజు రాఘవయ్య చౌదరి, సముద్రాల రాఘవాచార్య, ముద్దుకృష్ణ, జంపన పాటలు రాశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు.[1]

పాటలు

[మార్చు]
  1. ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే.. మానధనుడు - పి. లీల
  2. ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) . రచన: ముద్దుకృష్ణ.
  3. కలువల రాజా కథ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల
  4. చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు తళుకు - ఘంటసాల, జిక్కి రచన: సదాశివ బ్రహ్మం.
  5. చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామచిలకా - మాధవపెద్ధి, జిక్కి
  6. దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి న్యాయం - ఘంటసాల . రచన: కొసరాజు.
  7. మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - పి. లీల
  8. వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట ఏరులై కబళించే - ఘంటసాల, జిక్కి బృందం . రచన: కొసరాజు.
  9. వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి
  10. వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి రండయా - జిక్కి, పిఠాపురం బృందం

మూలాలు

[మార్చు]
  1. ఆంథ్రజ్యోతి, మీకు తెలుసా ! (4 May 2016). "60 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'జయం మనదే'". Archived from the original on 6 మే 2016. Retrieved 4 May 2018.