Jump to content

చెంగల్వ

వికీపీడియా నుండి

చెంగల్వ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Tribe:
Subtribe:
Genus:
Species:
C. asiaticum
Binomial name
Crinum asiaticum

చెంగల్వ (లాటిన్ Crinum asiaticum) ఒకరకమైన పువ్వుల చెట్టు.

చరిత్ర

[మార్చు]

చెంగల్వ 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, లేత-ఆకుపచ్చ, 50-150 నుండి 3-20 సెం.మీ., సమాంతర సిరలను కలిగి ఉంటాయి.దీని పువ్వులు 10-50 సమూహాలలో, పొడవైన కొమ్మ పైభాగంలో పెరుగుతాయి. పువ్వులు రాత్రి వేళల సువాసనగా ఉంటాయి.పండ్లు 2.5-6.5 సెం.మీ వెడల్పుతో, 1-5 విత్తనాలతో ఉంటాయి. దీని విత్తనాలు 2-4.5 సెం.మీ వెడల్పుతో ఉంటాయి. ఇది తీరప్రాంత అడవులు, మడ అడవులు, ఇసుక తీరాలు , నీటి అంచుల సరిహద్దుల వెంట తక్కువ ఎత్తులో పెరుగుతుంది. చెంగల్వ చెట్టు పొడి నేలలు, తేమ నేలలు, బాగా ఎండిపోయిన నేలలలో పెరుగ గలదు [1] [2] చెంగల్వ పువ్వల చెట్టును కేసరచెట్టు, లక్ష్మీనారాయణచెట్టు ,విషమంగలి చెట్టు అని పిలుస్తుంటారు [3]

ఉపయోగములు

[మార్చు]

చెంగల్వ మొక్కల భాగాన్ని జీర్ణశయాంతర రుగ్మతలు, చర్మ వ్యాధులు, జ్వరం, చెవి, దిమ్మలు, టాన్సిలిటిస్, గవదబిళ్ళలు, హెర్నియా, రుమాటిజం, మూత్ర సమస్యలు, ఎముక పగులు, విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు [4][5] చెంగల్వ మొక్క నుంచి వచ్చే పెద్ద లిల్లీ మొక్క. ఇది ఇంటి తోట కోసం వేయవచ్చును . ముఖ్యంగా పెద్దది అయినప్పుడు, పూర్తి ఎండ నుండి కొంచము నీడ లో దీనిని పెంచవచ్చు. ఇది మాములు నీటి పారుదల ఉంటే కూడా పెరగడానికి సరిపోతుంది . చిత్తడి లిల్లీ పువ్వును చెరువు అంచుకు సమీపంలో కూడా పెంచవచ్చు [6] చెంగల్వ మొక్క విష మొక్క మొత్తం విషపూరితమైనది, వివిధ రకాల ఆల్కలాయిడ్లు ఉన్నాయి, వీటిని మనుషుల శరీరం తట్టుకోవు. చర్మంపై మొక్కల రసాలుపడకుండా ఉండటానికి చేతి తొడుగులు పెట్టుకోవలెను , ఎందుకంటే వాపు లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది . దీన్ని తినవద్దు . పిల్లలకు ,కు క్కలు, పిల్లులు దూరముగా ఈ మొక్కను ఉంచవలెను . మనుషులకు కూడా అంతే ప్రమాదకరం ఈ చెంగల్వ మొక్క

మూలాలు

[మార్చు]
  1. "NParks | Crinum asiaticum". www.nparks.gov.sg. Retrieved 2023-01-10.
  2. "Crinum asiaticum L. | Species | India Biodiversity Portal". web.archive.org. 2017-08-24. Archived from the original on 2017-08-24. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Crinum asiaticum - Grand Crinum Lily". www.flowersofindia.net. Retrieved 2020-09-23.
  4. "Flowering Plants of TDU - Crinum asiaticum". The University of Trans-Disciplinary Health Sciences and Technology (TDU) (in ఇంగ్లీష్). 2019-07-26. Archived from the original on 2020-10-01. Retrieved 2020-09-23.
  5. "Environmental science Journal Impact Factor | Juniper Publishers". juniperpublishers.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-10.
  6. "National Tropical Botanical Garden | Crinum asiaticum var. pedunculatum - Plant Detail - Meet The Plants". National Tropical Botanical Garden (in ఇంగ్లీష్). Retrieved 2020-09-24.


మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చెంగల్వ&oldid=4339391" నుండి వెలికితీశారు