Jump to content

చర్ల మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°24′N 80°29′E / 18.4°N 80.49°E / 18.4; 80.49
వికీపీడియా నుండి
(చర్ల నుండి దారిమార్పు చెందింది)

చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1].

చర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°24′N 80°29′E / 18.4°N 80.49°E / 18.4; 80.49
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం చెర్ల (జెడ్)
గ్రామాలు 59
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 479 km² (184.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 4,29,247
 - పురుషులు 21,167
 - స్త్రీలు 21,780
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.43%
 - పురుషులు 58.56%
 - స్త్రీలు 42.43%
పిన్‌కోడ్ 507133

ఈ మండల కేంద్రం గోదావరి నది ఒడ్డున, పర్ణశాలకు దగ్గరలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  74  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 13 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం చెర్ల గ్రామం.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ చర్ల మండలం, ఖమ్మం జిల్లా,భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చర్ల మండలాన్ని 74 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా  - మొత్తం 42,947- పురుషులు 21,167 - స్త్రీలు 21,780.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 479 చ.కి.మీ. కాగా, జనాభా 42,947. జనాభాలో పురుషులు 21,167 కాగా, స్త్రీల సంఖ్య 21,780. మండలంలో 11,091 గృహాలున్నాయి.[4]

భౌగోళికం

[మార్చు]

చర్ల గోదావరి నదీ తీరాన ఈ ప్రాంతంలో ఉంది.18°05′00″N 80°49′00″E / 18.0833°N 80.8167°E / 18.0833; 80.8167.[5] ఇది సగటు సముద్రమట్టానికి సుమారు 78 మీటర్లు అనగా 259 అడుగుల ఎత్తులో ఉంది.

విశేషాలు

[మార్చు]
  • తాలిపేరు ప్రాజెక్టు: ఇది తాలిపేరు నదిపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది పెద మిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.[6]
  • రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సుబ్బంపేట (జి)
  2. కొయ్యూరు (జెడ్)
  3. సుబ్బంపేట (జెడ్)
  4. రామానుజపురం
  5. చీమలపాడు
  6. గన్నవరం (జెడ్)
  7. సింగసముద్రం
  8. రేగుంట (జెడ్)
  9. రేగుంట (జి)
  10. ఉప్పెరగూడెం
  11. కొటూరు
  12. సీ. కతిగూడెం
  13. గొమ్ముపుల్లిబోయినపల్లి
  14. చింతకుంట (జెడ్)
  15. పులిబోయినపల్లి
  16. మొగుల్లపల్లి (జి)
  17. లింగాపురం (జెడ్)
  18. గంపల్లి (జెడ్)
  19. కొత్తపల్లి (జెడ్)
  20. రిచెపేట
  21. కేశవపురం
  22. దండుపేట (జెడ్)
  23. చెర్ల (జి)
  24. దోసిల్లపల్లి
  25. భూముల్లంక
  26. పూసుగుప్ప (పాచ్-1)
  27. పూసుగుప్ప (పాచ్-2)
  28. పూసుగుప్ప (జి)
  29. వద్దిపేట్ (జెడ్)
  30. ఉంజుపల్లి
  31. చెర్ల (జెడ్)
  32. తిప్పాపురం
  33. ఉయ్యాలమడుగు (జి)
  34. చలమల (జెడ్)
  35. పెద మిడిసిలెరు (జెడ్)
  36. పెద మిడిసిలెరు చల్క్-ఈ
  37. పెద మిడిసిలెరు చల్క్-ఇ
  38. బత్తినపల్లి
  39. కుర్నాపల్లి
  40. బొదనల్లి (జెడ్)
  41. బొదనల్లి (జి)
  42. చిన మిడిసిలెరు (జి)
  43. తెగద (జెడ్)
  44. జంగాలపల్లి
  45. తెగద (జి)
  46. గొమ్ముగూడెం (జెడ్)
  47. లింగాల (జెడ్)
  48. కలివేరు (జెడ్)
  49. పెద్దిపల్లి
  50. జెట్టిగూడెం (జెడ్)
  51. ముమ్మిడారం (జెడ్)
  52. ఆర్. కొత్తగూడెం
  53. చింతగుప్ప
  54. కుదునూరు (జి)
  55. కుదునూరు (జెడ్)
  56. దేవరపల్లి (జెడ్)
  57. మామిడిగూడెం చల్క్
  58. మామిడిగూడెం (జెడ్)
  59. పులిగుండల
  60. గోగుబాక (జెడ్)
  61. రల్లగూడెం

గమనిక:నిర్జన గ్రామాలు పదమూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2017-11-19.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. Falling Rain Genomics, Inc - Cherla
  6. "Irrigation profile of Khammam district". Archived from the original on 2012-07-17. Retrieved 2008-10-07.

వెలుపలి లంకెలు

[మార్చు]