Jump to content

ఘట్టమనేని రమేష్ బాబు

వికీపీడియా నుండి
ఘట్టమనేని రమేశ్ బాబు
జననం13 అక్టోబర్ 1965
మద్రాస్, భారతదేశం
మరణం8 జనవరి 2022
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారతదేశం
వృత్తినటుడు, సినీ నిర్మాత
జీవిత భాగస్వామిమృదుల
పిల్లలుభారతి, జయకృష్ణ
తల్లిదండ్రులుఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవి

రమేశ్ బాబు (అక్టోబర్ 13, 1965 - జనవరి 8, 2022) 1965లో అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించాడు. 1974లో ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సామ్రాట్ తో హీరోగా పరిచయం అయ్యాడు. చివరగా1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.

1987లో విడుదలైన సామ్రాట్

చిత్రసమాహారం

[మార్చు]

నటుడిగా

[మార్చు]
Year Title Role(s) Co-Star Director Notes
1977 మనుషులు చేసిన దొంగలు కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు ఎం. మల్లిఖార్జునరావు చైల్డ్ ఆర్టిస్ట్
1979 నీడ మురళీ మోహన్ దాసరి నారాయణరావు చైల్డ్ ఆర్టిస్ట్ [1]
1981 పాలు నీళ్ళు మోహన్ బాబు, జయప్రద దాసరి నారాయణరావు చైల్డ్ ఆర్టిస్ట్
1987 సామ్రాట్ సామ్రాట్ సోనమ్, శారద వి.మధుసూధన్ రావు అరంగేట్రం
1988 చిన్ని కృష్ణుడు కుష్బూ, శరత్ బాబు జంధ్యాల [2]
1988 బజారు రౌడీ రంజిత్ నదియా, గౌతమి, కైకాల సత్యనారాయణ ఎ. కోదండరామి రెడ్డి
1988 కలియుగ కర్ణుడు జూహీ చావ్లా, కృష్ణ, జయప్రద కృష్ణ
1988 ముగ్గురు కొడుకులు రాజేంద్ర కృష్ణ, మహేష్ బాబు, రాధ కృష్ణ
1989 బ్లాక్ టైగర్ భానుప్రియ, మోహన్ బాబు దాసరి నారాయణరావు
1989 కృష్ణ గారి అబ్బాయి గౌతమి, నీతు, అంజలి దేవి వి.మధుసూధన్ రావు
1990 ఆయుధం వాణీ విశ్వనాథ్, కృష్ణ, రాధ కె. మురళీ మోహన్ రావు
1990 కలియుగ అభిమన్యుడు శాంతి ప్రియ S. S. రవిచంద్ర
1991 నా ఇల్లే నా స్వర్గం దివ్య భారతి, కృష్ణ కె. రుష్యేందర్ రెడ్డి
1993 మామా కోడలు వాణీ విశ్వనాథ్, దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు
1993 అన్నా చెల్లెలు రవి ఆమని, సౌందర్య పి.చంద్రశేఖర్ రెడ్డి
1994 పచ్చతోరణం వేణు రంభ, అర్చన ఆదుర్తి సాయిభాస్కర్
1997 ఎన్‌కౌంటర్ సూర్యం కృష్ణ, రోజా ఎన్ శంకర్ సపోర్టింగ్ రోల్

నిర్మాతగా

[మార్చు]
Year Title Director Language Notes
1999 సూర్యవంశం ఇ.వి.వి.సత్యనారాయణ హిందీ Executive producer
2004 అర్జున్ గుణశేఖర్ తెలుగు
2007 అతిథి సురేందర్ రెడ్డి తెలుగు In collaboration with UTV Motion Pictures
2011 దూకుడు శ్రీను వైట్ల తెలుగు Presenter

మరణం

[మార్చు]

రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[3]

వంశవృక్షం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (9 January 2022). "రమేశ్ బాబు ప్రయోగాత్మక చిత్రం 'నీడ'". chitrajyothy. Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  2. Andhrajyothy (9 January 2022). "జంధ్యాల దర్శకత్వంలోనూ నటించిన రమేశ్ బాబు". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  3. Andhrajyothy (8 January 2022). "కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూత". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.