Jump to content

గోహేయి

వికీపీడియా నుండి
షింటో మందిరం ముందు గోహేయి

గోహేయి (Gohei (御幣)), ఆన్బె(onbe (御幣)), లేదా హెయ్సొకు(heisoku(幣束)) అనేవి రెండు వైపులా ( వంకర టింకర పతాకాలతో) అలంకరించిన కొయ్య దండాలు, వీటిని షింటో ఆచార కార్యాలలో వినియోగిస్తారు.

సాధారణంగా తెలుపు పతాకాలు ఉంటాయి, అయినప్పటికీ, అవి బంగారం, వెండి లేదా అనేక రంగుల కలయికతో కూడా కనిపిస్తాయి. పవిత్ర ఆవరణాల గుర్తింపుగా చేసే అలంకారాలలో ఉపయోగించే గడ్డి తాళ్లకు (షిమెనావా) తరచుగా వీటిని కూడా జోడిస్తారు.

పుణ్యక్షేత్ర పూజారి లేదా పరిచారికలు (మికో ) వివిధ షింటో ఆచారాలలో ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి , లేదా వస్తువును పవిత్రం చేయడానికి గోహేయిని వాడతారు. గోహేయిని కొన్ని వేడుకలకు ఉపయోగించినా, దీని సాధారణ ఉద్దేశ్యం దేవాలయాలలో పవిత్రమైన స్థలాన్ని శుభ్రపరచడానికి, ప్రతికూల శక్తిని కలిగి ఉన్నట్లు భావించే వస్తువులను శుద్ధి చేయడం, ఆశీర్వదించడం లేదా భూతవైద్యం అందించడం. ఇలాంటి శుద్ధీకరణ ఆచారాలే కాకుండా దీనిని ఓనుసా (వంకరటింకర కాగితపు జెండాలతో కూడిన కొయ్య మంత్రదండం) తోపాటు చేర్చి, ఉపాసనా (షిన్టాయ్ ) పరికరంగా షింటో పుణ్యక్షేత్రంలో వినియోగిస్తారు.

ఇది కూడ చూడు

[మార్చు]
  • ఫ్లైల్
  • గున్బాయి
  • ఇనావు, ఐను ఆచారాలలో ఉపయోగించే కొయ్య దండాలు
  • ఓనుసా
  • షాకు
  • సైహై
  • హు
  • జపనీస్ షింటో, షింటో కళ, షింటో పుణ్యక్షేత్ర నిర్మాణాలకు సంబంధించిన పదాల వివరణ కోసం గ్లోసరీ ఆఫ్ షింటో.

ప్రస్తావనలు

[మార్చు]
  • Bowker, John W (2002). The Cambridge Illustrated History of Religions. New York City: Cambridge University Press. ISBN 0-521-81037-X. OCLC 47297614.
  • Littleton, C Scott (2002). Shinto: Origins, Rituals, Festivals, Spirits, Sacred Places. Oxford, NY: Oxford University Press. ISBN 0-19-521886-8. OCLC 49664424.
  • Picken, Stuart DB (2002). The A to Z of Shinto. The Scarecrow Press. ISBN 0-8108-5586-0.
"https://te.wikipedia.org/w/index.php?title=గోహేయి&oldid=3442692" నుండి వెలికితీశారు