Jump to content

ఖండూ రంగ్‌నేకర్

వికీపీడియా నుండి
ఖండూ రంగ్‌నేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖండేరావ్ మోరేశ్వర్ రంగ్‌నేకర్
పుట్టిన తేదీ(1917-06-27)1917 జూన్ 27
బొంబాయి, బాంబే ప్రెసిడెన్సీ
మరణించిన తేదీ1984 అక్టోబరు 11(1984-10-11) (వయసు 67)
థానే, మహారాష్ట్ర
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం pace
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 39)1947 నవంబరు 28 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1948 జనవరి 23 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 3 85
చేసిన పరుగులు 33 4,602
బ్యాటింగు సగటు 5.50 41.83
100లు/50లు 0/0 15/16
అత్యధిక స్కోరు 18 217
వేసిన బంతులు 1,680
వికెట్లు 21
బౌలింగు సగటు 40.95
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/112
క్యాచ్‌లు/స్టంపింగులు 1 42
మూలం: Cricinfo

ఖండేరావ్ మోరేశ్వర్ 'ఖండూ' రంగ్‌నేకర్ (1917 జూన్ 27- 1984 అక్టోబరు 11) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు . రంగ్‌నేకర్ అటాకింగ్ బ్యాట్స్‌మన్. అతని కాలంలో అత్యుత్తమ భారతీయ ఎడమ చేతి వాటం ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. కవర్ పాయింట్ వద్ద మంచి ఫీల్డరు, ఏ చేతితోనైనా ఫీల్డింగ్ చేయగలిగేవాడు.

రంగ్‌నేకర్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను బాంబే పెంటాంగ్యులర్‌లో ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో తన మొదటి ప్రదర్శనలో వంద పరుగులు చేశాడు. అతను 1947-48లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో పెద్దగా విజయం సాధించలేదు. పర్యటన సందర్భంగా శ్వేత ఆస్ట్రేలియా విధానాన్ని, దాన్ని బట్టి వచ్చిన శ్వేతజాతీయేతర వలసలపై నిషేధాన్నీ బహిరంగంగా విమర్శించిన ఏకైక భారతీయ ఆటగాడు రంగ్‌నేకర్. [1]

రంగ్‌నేకర్, బైరామ్‌జీ జీజీబోయ్ స్కూల్, సెయింట్ జేవియర్స్‌ లలో చదువుకున్నాడు. ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో BA చదివాడు. 1939 - 1945 మధ్య అతను భారతదేశంలోని అత్యుత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకడు. 1945లో ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు [2] అతను 1940, 1942, 1944లో వెస్ట్రన్ ఇండియా డబుల్స్, 1940లో మిక్స్‌డ్ డబుల్స్‌ను గెలుచుకున్నాడు. అతను 1960లలో థానే మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు.


అతను 1962-63 నుండి 1969-70 వరకు BCCI వైస్ ప్రెసిడెంటుగా, 1962-63లో బాంబే క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 1962-63, 1978-79 మధ్య వైస్ ప్రెసిడెంటుగా పనిచేసాడు.

అతను బొంబాయిలో ఇండియన్ కస్టమ్స్‌లో పనిచేశాడు. టెక్స్‌టైల్ స్టోర్ వ్యాపారాన్ని నడిపాడు. రంగ్‌నేకర్ గొంతు క్యాన్సర్‌తో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Bonnell & Sproul, pp. 122-23.
  2. Badminton Association of India. "List of Indian National Championship Winners". Archived from the original on 26 August 2014. Retrieved 22 August 2014.