Jump to content

కోలోరియాంగ్

అక్షాంశ రేఖాంశాలు: 27°55′N 93°21′E / 27.917°N 93.350°E / 27.917; 93.350
వికీపీడియా నుండి
కోలోరియాంగ్
కోలోరియాంగ్ is located in Arunachal Pradesh
కోలోరియాంగ్
కోలోరియాంగ్ is located in India
కోలోరియాంగ్
Coordinates: 27°55′N 93°21′E / 27.917°N 93.350°E / 27.917; 93.350
దేశం India
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
జిల్లాకురుంగ్ కుమే
Elevation1,000 మీ (3,000 అ.)
జనాభా
 • Total24,300 population_as_of = 2,011

కొలోరియాంగ్, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ లోని కురుంగ్ కుమే జిల్లాలో టిబెట్ సరిహద్దులో ఉన్న ఒక కొండ ప్రాంతం గల కొలోరియాంగ్ జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం. ఇది సముద్ర మట్టానికి 1,000 మీటర్లు (3,300 అ.) ఎత్తులో ఉంది. [1] కొలోరియాంగ్ పట్టణం చుట్టూ చుట్టూ అన్నీఅధిక పర్వతాలు [2] కురుంగ్ ప్రధాన ఉపనది సుబన్సిరి నదీ కుడి వైపులో ఉంది.వేసవిలో వాతావరణం వేడిగానూ, వర్షాలతోకూడి ఉంటుంది.శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది.సముద్ర మట్టానికి 1,040 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణం పాత పరిపాలనా కేంద్రం కూడా.ఈ పట్టణం 5,39,672.50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది సుమారు రాష్ట్ర రాజధాని ఇటానగర్ నుండి 257 కి.మీ.దూరంలో ఉంది.

కురుంగ్ కుమే జిల్లా రాజధానిగా పనిచేస్తున్నఈ పట్టణ పేరు రెండు పదాల నుండి ఏర్పడింది. కోలో అంటే ఈ ప్రాంత యజమాని అని నమ్ముతున్న వ్యక్తి పేరు, రియాంగ్ అంటే భూమి అని అర్ధం. ఇది

ప్రకృతి వాతావరణానికి పేరుగాంచిన ఈ పట్టణం, జిరో నుండి కొలోరియాంగ్ వెళ్లే మార్గంలో, అనేక విశ్రాంతి స్థలాల కేంద్రాలు ఉన్నాయి. పట్టణాన్ని సందర్శించే పర్యాటకులు సమీప గ్రామాలైన సంగ్రామ్, పాలిన్, డీడ్, టాలో వైపు కూడా వెళతారు.సాధారణ జనాభా వాడుకలో కొలోరియాంగ్ ను మినీ ఇండియా అని పిలుస్తున్నందున, పట్టణం పైన వాతావరణం నుండి చూసినప్పుడు ఇది నిరూపించబడింది.

ఈ ప్రాంతానికి విమాన సేవలు అందించే సమీప విమానాశ్రయం నహర్‌లగన్ పట్టణంలో ఉంది. అంతర్జాతీయ గమ్యస్థానాల నుండి ప్రయాణిస్తున్న ప్రజలు గౌహతిలోని లోక్ ప్రియా గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను ఎక్కి, కొలోరియాంగ్కు సమీపంలో ఉన్న అస్సాంలోని లీలబారి విమానాశ్రయానికి అనుసంధానించబడిన విమానాలలో గమ్యం చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోజుల్లో ఇటానగర్ నుండి నహర్‌లాగన్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సేవ అందుబాటులో ఉంది. 

వసంత రుతువు, శీతాకాలంలో ఉష్ణోగ్రత 20, 30.సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. బెంజియా, చేరా, నాంగ్రామ్, చెల్లో, రియా, యుమ్లామ్, గిడా, గిచిక్, కియోగి, బామాంగ్, కిపా, టాడర్, గ్యామర్, టేమ్, ఫసాంగ్, తాయ్, లోకం, సంఘ, తమ్చి, పిసా, నైషి సమాజంలోని వంశాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి. లాంగ్టే  పండగ ఈ ప్రాంతం ప్రజలకు ముఖ్యమైన వార్షిక పండుగను జరుపుకుని ఆనందిస్తారు. మానవత్వం, పశుసంపద, సాధారణ శ్రేయస్సు రక్షణ,  శ్రేయస్సు కోసం వివిధ దేవతలను  ప్రార్థిస్తారు.ఈ పండగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు

న్యోకుమ్ పండగను కూడా ఎక్కువ మంది ప్రజలు ఆనందంతో జరుపుకుంటారు. ఇక్కడ న్యుబు, స్థానిక పూజారి స్థానిక ప్రార్థనను జరిపిస్తాడు, అక్కడ అతను సమర్పణలను సానుకూల విజయం, జ్ఞానోదయంతో వ్యవసాయ పంటలు అధిక ఉత్పత్తికోసం పూజలు చేస్తాడు. .

ఈ పట్టణానికి సమీపంలో నిక్జా, యాపక్, తయాంగ్, న్యోల్లో, పింగ్‌గాంగ్, (తైపా), అనే గ్రామాలు ఉన్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 Arunachal Pradesh District Gazetteers: Tirap District, Government of Arunachal Pradesh, 1981
  2. Toni Huber, Stuart Blackburn (2012). Origins and Migrations in the Extended Eastern Himalayas. Brill Publishers. p. 73. ISBN 9004226915. Retrieved 30 July 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]