Jump to content

కీ (సినిమా)

వికీపీడియా నుండి
కీ
కీ సినిమా పోస్టర్
దర్శకత్వంనాగేంద్ర ప్రసాద్
స్క్రీన్ ప్లేనాగేంద్ర ప్రసాద్
అనిల్ గూడూరు
కథనాగేంద్ర ప్రసాద్
దీనిపై ఆధారితంఎగ్జామ్ (2009)
నిర్మాతసుకుమార్ రెడ్డి
తారాగణంజగపతిబాబు, స్వప్న
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పునందమూరి తారక రామారావు
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ థియేటర్ ఎంటర్టైన్మెంట్స్[1]
విడుదల తేదీ
2011 జూలై 16
సినిమా నిడివి
84 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కీ, 2011 జూలై 16న విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.[2] డ్రీమ్ థియేటర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో సుకుమార్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[3] ఇందులో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[4] ఎగ్జామ్ అనే ఇంగ్లీష్ సినిమాకు రీమేక్ ఇది.[5][6]

కథా నేపథ్యం

[మార్చు]

ఒక ప్రత్యేకమైన పరీక్షకోసం ఒక క్లోజ్డ్ గదిలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు సమావేశమవుతారు. ఆ గదిలోకి ఇన్విజిలేటర్ (జగపతి బాబు) వస్తాడు. అతను అడిగే ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానం ఆధారంగా వారి నుండి ఒక అభ్యర్థిని మాత్రమే ఎన్నుకోవాలని తన కంపెనీ భావిస్తుందని వారికి చెబుతాడు. సమాధానం రాయడానికి కొన్ని షరతులు కూడా విధిస్తాడు. ఆ షరతులలో విఫలమైన వారు ఈ ఉద్యోగానికి అనర్హులు. వారికి ఎటువంటి ప్రశ్న ఇవ్వకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి అక్కడినుండి వెళ్ఙపోతాడు. తొమ్మిది మంది అభ్యర్థులు సరైన సమాధానం ఇవ్వడానికి మొదట సరైన ప్రశ్నను కనుగొనవలసి ఉంటుంది. వారి విశ్లేషణ, నైపుణ్యంతో వారంతా కలిసి ప్రశ్నను కనుగొంటారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వారి నిజమైన స్వభావాలు బయటకు రావడం ప్రారంభమవుతాయి. ఒక్కొక్క అభ్యర్థి ఎలిమినేట్ అవుతుంటాడు. ఎవరు గెలుస్తారు, విజేత ఈ కథకు ‘ప్రశ్న’ ఎలా ‘ప్రశ్న’ కనుగొంటారన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]
  • జగపతి బాబు (ఇన్విజిలేటర్‌)
  • స్వప్న
  • సంపత్ (సంపమ్)
  • సుకుమార్ (మోయి)
  • దీప్తి (వాజ్‌పేయి)
  • అల్తాఫ్ (మీర్జా)
  • ధనుంజయ్
  • సోనియా
  • కీ విలియమ్స్ (మలీక్)
  • చిన్న (రాజ్జు)
  • నరసింహ
  • రాజ్ (కిరణ్)

స్పందన

[మార్చు]

'పాత్రలకు పేర్లు ఇవ్వకుండా, 90 నిముషాలకు మించి సినిమా తీయడమనేది ప్రశంసనీయమైన ప్రయత్నం, నటుడు జగపతి బాబు ఈ సినిమాలో చిన్న పాత్ర చేయడానికి అంగీకరించడం గొప్ప విషయం' అని 123తెలుగు.కామ్ రాసింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Key (Overview)". 123telugu.com.
  2. "Key (Banner)". Super Good Movies.com. Archived from the original on 16 August 2016. Retrieved 17 July 2021.
  3. "Key (Direction)". Now Running.com. Archived from the original on 2019-02-23. Retrieved 2021-07-17.
  4. "Key (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-02-22. Retrieved 2021-07-17.
  5. "Key (Remarks)". Cinegoer.com. Archived from the original on 5 February 2015. Retrieved 17 July 2021.
  6. Rajamani, Radhika. "Review: Key is certainly different". Rediff (in ఇంగ్లీష్). Retrieved 17 July 2021.
  7. "Key Movie Review - Jagapathi babu and others - 123Telugu.com". www.123telugu.com. Retrieved 17 July 2021.