Jump to content

కాకరకాయ పులుసు కూర

వికీపీడియా నుండి

కాకరకాయ పులుసు కూర ఒక శాకాహార వంటకం.[1]

కాకరకాయ పులుసు కూర
కాకరకాయ పులుసు కూర
పులుసు కూర
మూలము
మూలస్థానంభారత దేశము
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ

కావల్సిన పదార్థాలు

[మార్చు]

కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు (రసం), బెల్లం, పసుపు, ఉప్పు, కారం.

తాలింఫు సామాను

[మార్చు]

నూనె, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ.

కాకరకాయ ఉల్లిపాయ పులుసు కూర

తయారీ విధానం

[మార్చు]

ముందుగా కాకరకాయలను గుండ్రంగా ఒక మోస్తరు మందంగా చక్రాలుగా తరుగుకోవాలి. ఉల్లిపాయలను కూరముక్కలుగా తరుగుకోవాలి. కాకరకాయముక్కలను పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. బేసిన్ వేడి చేసి, నూనె వేడి ఎక్కాక, తాలింఫు సామాను వరుసగా చాయమినపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర కాస్త వేగాక, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి, దీనిలో నిలుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, తరువాత కరివేపాకు వేసి కాసేపు వేయించాలి, ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఇవి కాస్త మెత్త బడ్డాక చల్లారిన కాకరకాయ ముక్కలను పిండి, ఉల్లిపాయ ముక్కల్లో వేసి కలియబెట్టాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు (రసం) వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో చిన్న బెల్లం ముక్క, కారం వేసి కలియబెట్టి మూతపెట్టాలి. రెండు నిమిషాలు తర్వాత స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. [2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kakarakaya Pulusu Bellam Koora - Sweet & Sour Bitter-Gourd Curry - Andhra Recipes Telugu Vantalu Gayatri Vantillu". www.gayatrivantillu.com. Retrieved 2018-03-04.
  2. http://www.gayatrivantillu.com/recipes-2/curries-1/kakarakayapulusubellam