ఒడిశా జిల్లాల జాబితా
ఒడిశా జిల్లాల ଓଡ଼ିଶାର ଜିଲ୍ଲାସମୂହ | |
---|---|
రకం | ఒడిశా జిల్లాలు |
స్థానం | ఒడిశా |
సంఖ్య | 30 |
జనాభా వ్యాప్తి | దేవగఢ్ – 3,12,520 (అత్యల్ప); గంజాం – 35,29,031 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | మయూర్‌భంజ్ – 10,418 చ.కి.మీ (అతిపెద్ద); జగత్‌సింగ్‌పూర్ – 1,759 చ.కి.మీ (చిన్నది) |
ప్రభుత్వం | ఒడిశా ప్రభుత్వం |
ఉప విభజన | ఉప విభాగాలు, తాలూకాలు లేదా తహసీల్లు |
ఒడిశా,ఇది భారతదేశం తూర్పు తీరంలో ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 2023 ఆగస్టు నాటికి 30 జిల్లాలు ఉన్నాయి.[1][2][3] ఈ 30 జిల్లాల పాలనను క్రమబద్ధీకరించడానికి తిరిగి మూడు పరిపాలనా విభాగాలు సెంట్రల్ డివిజను, నార్త్ డివిజను, సౌత్ డివిజను అనే వేర్వేరు విభాగాలు ఉన్నాయి.వాటి ప్రధాన కార్యాలయాలు వరుసగా కటక్ (సెంట్రల్ డివిజన్), సంబల్‌పూర్ (నార్త్ డివిజన్ ), బెర్హంపూర్ (దక్షిణ డివిజన్) ఉన్నాయి. ప్రతి విభాగంలో 10 జిల్లాలు ఉంటాయి. దాని పరిపాలనా నిర్వహణకు ప్రధాన అధికారిగా రెవెన్యూ డివిజనల్ కమీషనర్ (ఆర్.డి.సి) గా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సీనియర్ ర్యాంక్ కలిగిన అధికారి ఉంటారు. పరిపాలనా శ్రేణిలో ఆర్.డి.సి. స్థానం, జిల్లా పరిపాలన, రాష్ట్ర సచివాలయం మధ్య ఉంటుంది. ప్రతి జిల్లా పరిపాలన కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చేత నిర్వహించబడింది. వీరి నియామకం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా జరుగుతుంది. కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ జిల్లాలో ఆదాయాన్ని సేకరించడం, జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణకు బాధ్యత వహిస్తాడు. ప్రతి జిల్లా ఉప విభాగాలుగా విభజించబడింది, ప్రతి ఒక్క ఉపవిభాగ పరిపాలన సబ్-కలెక్టర్ & సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ద్వారా జరుగుతుంది. ఉప-విభాగాలు తహసిల్‌లుగా విభజించారు. తహసీల్దార్ నేతృత్వంలో తహసీల్‌లు ఉంటారు. ఒడిశాలో 03 డివిజన్లు, 30 జిల్లాలు, 58 సబ్ డివిజన్లు, 317 తాహసీల్లు, 314 బ్లాక్‌లు ఉన్నాయి.
విభాగాలు వారీగా జిల్లాల జాబితా
[మార్చు]ఉత్తర విభాగం | సెంట్రల్ డివిజన్ (కటక్) | దక్షిణ విభాగం (బెర్హంపూర్) |
---|---|---|
పరిపాలన
[మార్చు]ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా రెవెన్యూ సేకరణ, పరిపాలనకు బాధ్యత వహించటానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి, శాంతిభద్రతలు, సంబంధిత సమస్యలను నిర్వహించడానికి ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్.) అధికారిగా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్.పి.) బాధ్యత వహిస్తారు. అన్ని శాఖలు పరిపాలనకు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు ఉంటారు. వీరు అందరిపై జిల్లా కలెక్టరు పర్వేక్షణ ఉంటుంది.
జిల్లాలు
[మార్చు]ఒడిశాలో 2023 ఆగస్టు నాటికి 30 జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణం ప్రకారం మయూర్‌భంజ్ అతి పెద్ద జిల్లా, జగత్‌సింగ్‌పూర్ అతి చిన్న జిల్లా. ఒడిశాలో జనాభా ప్రకారం గంజాం అతి పెద్ద జిల్లా. దేవగఢ్ జిల్లా అతి చిన్న జిల్లా. ఒడిశా రాజధాని భుబనేశ్వర్, ఇది ఖుర్ధా జిల్లాలో ఉంది. 30 జిల్లాల వైశాల్యంతో జనాభా వివరాలు ఈ క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి.[4][5]
కోడ్ | జిల్లాలు | ముఖ్యపట్టణం | జనాభా (2011)[6] |
విస్తీర్ణం (km2) | జనసాంధ్రత 2011 (km2) |
పటం |
---|---|---|---|---|---|---|
1 | అంగుల్ జిల్లా | అంగుల్ | 1,273,821 | 6,375 | 200 | |
2 | బౌధ్ జిల్లా | బౌధ్ | 441,162 | 3444.8 | 128 | |
3 | బలాంగిర్ జిల్లా | బలాంగిర్ | 1,648,997 | 6,575 | 251 | |
4 | బర్గఢ్ జిల్లా | బర్గఢ్ | 1,481,255 | 5,837 | 254 | |
5 | బాలాసోర్ జిల్లా | బాలాసోర్ | 2,320,529 | 3,634 | 638 | |
6 | భద్రక్ జిల్లా | భద్రక్ | 1,506,337 | 2,505 | 601 | |
7 | కటక్ జిల్లా | కటక్ | 2,624,470 | 3,932 | 667 | |
8 | దేవగఢ్ జిల్లా | దేవగఢ్ | 312,520 | 2,782 | 112 | |
9 | ధేన్‌కనల్ జిల్లా | ధేన్‌కనల్ | 1,192,811 | 4,452 | 268 | |
10 | గంజాం జిల్లా | ఛత్రపూర్ | 3,529,031 | 8,206 | 430 | |
11 | గజపతి జిల్లా | పర్లాకిమిడి | 577,817 | 3,850 | 150 | |
12 | ఝార్సుగూడా జిల్లా | ఝార్సుగూడా | 579,505 | 2,081 | 278 | |
13 | జాజ్‌పూర్ జిల్లా | జాజ్‌పూర్ | 1,827,192 | 2887.69 | 633 | |
14 | జగత్‌సింగ్‌పూర్ జిల్లా | జగత్‌సింగ్‌పూర్ | 1,136,971 | 1,759 | 646 | |
15 | ఖుర్ధా జిల్లా | ఖుర్ధా | 2,251,673 | 2,813 | 800 | |
16 | కెందుఝార్ జిల్లా | కెందుఝార్ | 1,801,733 | 8,303 | 217 | |
17 | కలహండి జిల్లా | భవానీపట్న | 1,576,869 | 7,920 | 199 | |
18 | కంథమాల్ జిల్లా | ఫూల్‌బని | 733,110 | 7,654 | 96 | |
19 | కోరాపుట్ జిల్లా | కోరాపుట్ | 1,379,647 | 8,807 | 157 | |
20 | కేంద్రపడా జిల్లా | కేంద్రపడా | 1,440,361 | 2,644 | 545 | |
21 | మల్కనగిరి జిల్లా | మల్కనగిరి | 613,192 | 5,791 | 106 | |
22 | మయూర్‌భంజ్ జిల్లా | బారిపడా | 2,519,738 | 10,418 | 242 | |
23 | నవరంగపూర్ జిల్లా | నవరంగపూర్ | 1,220,946 | 5,294 | 231 | |
24 | నౌపడా జిల్లా | నౌపడా | 610,382 | 3,852 | 158 | |
25 | నయాగఢ్ జిల్లా | నయాగఢ్ | 962,789 | 3,890 | 247 | |
26 | పూరీ జిల్లా | పూరి | 1,698,730 | 3,051 | 557 | |
27 | రాయగడ జిల్లా | రాయగడ | 967,911 | 7,073 | 137 | |
28 | సంబల్‌పూర్ జిల్లా | సంబల్‌పూర్ | 1,041,099 | 6,702 | 155 | |
29 | సుబర్నపూర్ జిల్లా | సుబర్నపూర్ | 610,183 | 2,337 | 261 | |
30 | సుందర్‌గఢ్ జిల్లా | సుందర్‌గఢ్ | 2,093,437 | 9,712 | 215 | |
ఒడిశా | 41,974,218 | 154,468.98 | 272 |
మూలాలు
[మార్చు]- ↑ "Districts of Odisha". Official Portal. Bhubaneswar: Government of Odisha. Retrieved 4 January 2013.
- ↑ "Districts of Orissa". Archived from the original on 16 January 2012. Retrieved 13 January 2012.
- ↑ "List of Districts" (PDF). Retrieved 13 January 2012.
- ↑ "Administrative Unit". Revenue & Disaster Management Department, Government of Odisha. Archived from the original on 21 August 2013. Retrieved 27 March 2015.
- ↑ The Office of Registrar General and Census Commissioner of India.
- ↑ "List of districts of Orissa". census2011.co.in.