ఎసిటోబాక్టర్
స్వరూపం
ఎసిటోబాక్టర్ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | Alpha Proteobacteria
|
Order: | |
Family: | |
Genus: | ఎసిటోబాక్టర్ Beijerinck 1898
|
Type species | |
Acetobacter aceti | |
జాతులు | |
A. aceti |
ఎసిటోబాక్టర్ (లాటిన్ Acetobacter) ఎసిటిక్ ఆమ్లం (Acetic acid) తయారుచేసే బాక్టీరియాలలో ఒక ప్రజాతి. ఇవి ఆమ్లజని సమక్షంలో ఆల్కహాల్ను ఎసిటిక్ ఆమ్లంగా మార్చగలవు.
ప్రాముఖ్యత
[మార్చు]ఎసిటోబాక్టర్ జీవులు విస్తృతమైన ఆర్థిక ప్రాముఖ్యత కలవి:
- వీటిని వినెగార్ (Vinegar) తయారీలో ఉపయోగిస్తున్నారు.
- ఇవి వైన్ (Wine) లో చేరి మెల్లగా ఎసిటిక్ ఆమ్లంగా మార్చి రుచిని పాడుచేస్తాయి.
- వీటిని కొన్ని రకాల బీర్ (Beer) కు ఆమ్లత్వాన్ని కలిగించడానికి ఉపయోగిస్తారు.
- కొన్ని రకాలు (Acetobacter xylinus) సెల్యులోజ్ (cellulose) తయారుచేయగలవు.