Jump to content

ఎబి డెవిలియర్స్

వికీపీడియా నుండి
ఎబి డెవిలియర్స్ (AB de Villiers)
దక్షిణాఫ్రికాతో 2009 లో డె విలియర్స్ శిక్షణ.
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్రహం బెంజిమన్ డెవిలియర్స్
పుట్టిన తేదీ (1984-02-17) 1984 ఫిబ్రవరి 17 (వయసు 40)
ప్రిటోరియా,
ట్రాన్స్వాల్ ప్రావిన్స్,
దక్షిణాఫ్రికా
మారుపేరుఎబి డి
ఎత్తు1.78 మీ. (5 అ. 10 అం.)
బ్యాటింగుకుడిచేయి
పాత్రబ్యాటింగ్,
వికెట్ కీపర్,
దక్షిణాఫ్రికా
ODI సారధి
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 296)2004 డిసెంబరు 17 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2013 డిసెంబరు 18 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 78)2005 ఫిబ్రవరి 2 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2013 డిసెంబరు 13 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.17
తొలి T20I (క్యాప్ 20)2006 ఫిబ్రవరి 24 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 నవంబరు 22 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003–2004నార్తర్న్స్
2004–టైటాన్స్ (స్క్వాడ్ నం. 17)
2008–2010ఢిల్లీ డేర్‌డెవిల్స్
2011–ఇప్పటివరకురాయల్ ఛాలెంజర్స్ బెంగులూరు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ODI FC T20I
మ్యాచ్‌లు 106 200 132 51
చేసిన పరుగులు 8074 8,621 9,961 867
బ్యాటింగు సగటు 50.46 54.56 49.80 21.67
100లు/50లు 21/39 24/48 24/53 0/4
అత్యుత్తమ స్కోరు 278* 162* 278* 79*
వేసిన బంతులు 204 192 234 -
వికెట్లు 2 7 2 -
బౌలింగు సగటు 52.00 28.85 69.00 -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/49 2/15 2/49 -
క్యాచ్‌లు/స్టంపింగులు 197/5 164/5 248/6 47/6
మూలం: Cricinfo, 2016 మార్చి 20

ఎబి డెవిలియర్స్ దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు, వన్డే జట్టు నాయకుడు. తన విభిన్న మైన బ్యాటింగ్ శైలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

నేపథ్యము

[మార్చు]

డివిలియర్స్ ఆటను, శైలిని వర్ణించేందుకు సాధారణ విశేషణాలు సరిపోక, పదాలు తడుముకునే పరిస్థితి. అయితే గొప్ప ఆటగాడు, దిగ్గజం అనే మాటలకు మించి అతనిలో ఏదో మాయ ఉంది. 2015 నాటికి వన్డేల్లో 50కు పైగా సగటు, 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక క్రికెటర్ అతను. కొంత కాలం ఇదే జోరును కొనసాగిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఒకప్పుడు ఇలా ఆడే క్రికెటర్ కూడా ఉండేవాడు... అని భవిష్యత్ తరాలు చెప్పుకునే కథల్లో అతను నాయకుడిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం.[1]

తొలినాళ్ళు

[మార్చు]

చాలా మంది దిగ్గజాలలాగే డివిలియర్స్ కెరీర్ కూడా సాదాసీదాగానే ఆరంభమైంది. తొలి టెస్టులోనే ఓపెనర్‌గా దిగిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల వరకు అందరిలో ఒకడిగానే ఉండిపోయాడు. జట్టు అవసరం కొద్దీ ఒకటో నంబర్‌నుంచి ఎనిమిదో స్థానం వరకు కూడా అతను బ్యాటింగ్‌కు దిగాడు. అయితే 2008లో అహమ్మ దాబాద్‌లో భారత్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాతే అతనికి టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు దక్కింది. డెవిలియర్స్ వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన రెండున్నరేళ్లకు గానీ మొదటి సెంచరీ కొట్టలేకపోయాడు. అది కూడా 2007 ప్రపంచకప్‌లో ఘోరమైన ఫామ్‌తో మూడు డకౌట్ల తర్వాత వచ్చిన శతకం! ఆ తర్వాత నిలకడ కొనసాగించినా... మరో రెండేళ్లకు అతనిలోని అసలైన హిట్టర్ బయటికి వచ్చాడు.[1]

రికార్డులు[1]

[మార్చు]

ఇతని పేరుతో పలు రికార్డులు ఉన్నాయి

  • 2009లో నవంబరులో కేప్‌టౌన్‌లో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్. దూకుడైన బ్యాటింగ్‌తో 75 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
  • 2015 కేప్‌టౌన్ మ్యాచ్‌నుంచి భారత్‌తో ఐదో వన్డే వరకు డివిలియర్స్ 100 ఇన్నింగ్స్‌లు ఆడి 5454 పరుగులు చేశాడు. సగటు 69.03 కాగా, స్టైక్‌రేట్ 110.51గా ఉండటం అతని సత్తా ఏమిటో చూపిస్తుంది. కెరీర్‌లోని 23 సెంచరీలు కూడా 100కు పైగా స్ట్రైక్‌రేట్‌తో చేయడం ఒక్క ఏబీకే సాధ్యమైంది.
  • 25వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగి కూడా ఐదు సార్లు శతకం మార్క్‌ను చేరుకోవడం మరే క్రికెటర్ వల్ల కాలేదు.
  • 2015లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతులు), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతులు), ఫాస్టెస్ట్ 150 (64 బంతులు)

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "క్రికెట్ డెవిల్". సాక్షి. 2015-10-29. Retrieved 2015-10-29.