Jump to content

ఊరికిచ్చిన మాట

వికీపీడియా నుండి
ఊరుకిచ్చిన మాట
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం బాలయ్య
తారాగణం చిరంజీవి,
బేతా సుధాకర్,
మాధవి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిలింస్
భాష తెలుగు

ఊరుకిచ్చిన మాట 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నవ బాలయ్య దర్శకత్వం వహించారు. చిరంజీవి, సుధాకర్, కవిత, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించారు.[1][2][3]

1981 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది

తారాగణం

[మార్చు]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

చిరంజీవి, సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: మన్నవ బాలయ్య
  • స్టూడియో: అమృత ఫిల్మ్స్
  • నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్
  • కూర్పు: ఎస్.పి.ఎస్. వీరప్ప
  • స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జాలాది
  • విడుదల తేదీ: జూన్ 24, 1981
  • సమర్పించినవారు: బాలయ్య మన్నవ
  • కథ: బాలయ్య మన్నవ
  • చిత్రానువాదం: బాలయ్య మన్నవ
  • సంభాషణ: డి.వి. నరసరాజు
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం, పి.వి. చలపతి రావు
  • ఆర్ట్ డైరెక్టర్: కె.ఎల్. ధార్
  • డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తారా (డాన్స్ మాస్టర్)

పాటల జాబితా

[మార్చు]

1: ఆడింది ఊరు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండిరారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2: చూపుల్లో చుట్టేసి , రచన: సీ.నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పీ.సుశీల

3: హూరుగాలిలో , రచన: సి.నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4: కోడికూసే పొద్దు పొద్దు , రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5: పైరగాలి పైట లాగుతుంటే , రచన: జాలాది రాజారావు,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6: వచ్చిపోరా రంగా , రచన: సి నారాయణ రెడ్డి., గానం: వాణి జయరాం

మూలాలు

[మార్చు]
  1. http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html
  2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
  3. staff. "Ooriki Ichina Maata (U)". Filmibeat. Retrieved 16 June 2015.

బాహ్య లంకెలు

[మార్చు]