Jump to content

ఇన్నర్ లైన్ పర్మిట్

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్‌కి ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరాలను చూపే గమనిక - గౌహతి విమానాశ్రయంలో.

ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అనేది భారతదేశంలో ఒక రక్షిత ప్రాంతంలోకి భారతీయ పౌరుడు ప్రవేశించడానికి, ప్రయాణించడానికీ అనుమతినిస్తూ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పరిమిత కాలానికి జారీ చేసే అధికారిక ప్రయాణ పత్రం. ఆ రాష్ట్రాల వెలుపలి నుండి భారతీయ పౌరులు రక్షిత రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఈ అనుమతిని పొందడం తప్పనిసరి. ఈ పత్రం, భారతదేశపు అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాల లోకి ప్రవేశించడానికి, ఆ ప్రాంతంలో ప్రయాణాలను నియంత్రించడానికీ ప్రభుత్వం చేసే ప్రయత్నం. భారత పౌరులు కానివారు ఆ ప్రాంతాల్లోకి ప్రవేశించాలంటే రక్షిత ప్రాంత అనుమతి (PAP) అనే పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. PAP కంటే ILP పొందడం చాలా సులభం.

గురించి

[మార్చు]

భారత రాజ్యాంగం ప్రకారం, భారతీయ పౌరులందరికీ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికీ, పని చేయడానికీ స్వేచ్ఛ ఉంది. అయితే రక్షిత హోదా కలిగిన కొన్ని రాష్ట్రాల లోకి ప్రవేశించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అంటే ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతులు అవసరం. రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి భారతీయ పౌరుడికి అధికారం ఇచ్చే అటువంటి అనుమతిని 'ఇన్నర్ లైన్ పర్మిట్' అంటారు. దేశంలో "ఇన్నర్ లైన్" అని పిలవబడే అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలకు ప్రవేశాన్ని ఇది మంజూరు చేస్తుంది.

అనుమతి అవసరమైన రాష్ట్రాలు

[మార్చు]
  • అరుణాచల్ ప్రదేశ్ — అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) దీన్ని జారీ చేస్తారు. అస్సాం, నాగాలాండ్‌తో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దుల లోని చెక్ గేట్ల ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ఇది అవసరం. తాత్కాలిక సందర్శకుల కోసం ILP 15 రోజులు చెల్లుబాటు అవుతుంది. అవసరమైతే దీన్ని పొడిగించే వీలుంది. రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. [1] [2] [3] పర్మిట్ ఆన్ అరైవల్ విధానాన్ని అమలు చేయాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. [4]
  • మిజోరం — మిజోరం ప్రభుత్వం జారీ చేస్తుంది. మిజోరం లోకి అంతర్-రాష్ట్ర సరిహద్దుల గుండా ఏదైనా చెక్ గేట్ ద్వారా ప్రవేశించాలంటే ఈ అనుమతి అవసరం. సాధారణంగా, సందర్శకులకు 15 రోజులు చెల్లుబాటు అయ్యేళా "తాత్కాలిక ILP" జారీ చేస్తారు. అసాధారణమైన పరిస్థితులలో ఇంకో 15 రోజులు పొడిగించవచ్చు, మరో నెల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంది. అయితే, స్థానిక నివాసి లేదా ప్రభుత్వ విభాగం చేసే స్పాన్సర్‌షిప్‌తో, "రెగ్యులర్ ILP"ని కొనుగోలు చేయవచ్చు. ఇది 6 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది, 6 నెలల చొప్పున మరో రెండుసార్లు పునరుద్ధరించవచ్చు. [5] [6] విమానంలో వచ్చినట్లయితే, ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు ILPని పొందవచ్చు. [7]
  • నాగాలాండ్ - నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేస్తుంది. నాగాలాండ్‌లోని స్వదేశీ నివాసులు కాని భారతీయ పౌరులు, విదేశీయులు ఎవరైనా, పరిమిత కాలానికి నాగాలాండ్ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే నాగాలాండ్ ప్రభుత్వం ఇచ్చే ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) పొందాలి. [8]
  • మణిపూర్ — మణిపూర్ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) పద్ధతిని మణిపూర్‌లో 2019 డిసెంబర్ 11 న ప్రవేశపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరంల తర్వాత ILP అవసరమైన నాల్గవ రాష్ట్రం, మణిపూర్. [9]
  • లక్షద్వీప్ - లక్షద్వీప్ ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ ద్వీప భూభాగంలోకి ప్రవేశించడానికి ఇన్నర్ లైన్ అనుమతి తప్పనిసరి. లక్షద్వీప్ కోసం ILPని పొందడానికి అనేక నియమాలు, నిబంధనలను నెరవేర్చాలి. [10]

లడఖ్‌లో లేహ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే గతంలో ILP అవసరం అయ్యేది. 2014 మే 1 నుండి అమలులోకి వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ జారీ సర్క్యులరులో దీన్ని రద్దు చేసారు. అయితే విదేశీ పౌరులు మాత్రం ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే రక్షిత ప్రాంత అనుమతిని పొందడం తప్పనిసరి. [11] 2017లో ILP ని తిరిగి ప్రవేశపెట్టి, మళ్ళీ 2021 లో తొలగించారు. [12]

ఇతర రాష్ట్రాల్లో ILP కోసం డిమాండ్లు

[మార్చు]

రాష్ట్రంలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ILPని ప్రవేశపెట్టాలని కర్ణాటక, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో ప్రజల నుండి డిమాండ్లు వచ్చాయి. [13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]
  1. Website of Lower Dibang Valley State of Arunachal Pradesh, http://roing.nic.in/permit.htm
  2. Entry procedure, State of Arunachal Pradesh, http://arunachalpradesh.nic.in/enter_ap.htm
  3. "Liza Travels". www.lizaworldtravels.com. Archived from the original on 2012-07-14.
  4. Chandra, Abhimanyu. "China urged to accept Arunachal as part of India, but Indians can't enter state without permits". Scroll.in.
  5. Entry procedure, State of Mizoram, http://mizoram.nic.in/more/ilp.htm
  6. "Untitled Page". Archived from the original on 6 September 2017. Retrieved 18 November 2014.
  7. "Fullstopindia.com". www.fullstopindia.com. Archived from the original on 2019-01-03. Retrieved 2023-01-04.
  8. "Nagaland Inner Line Permit". Retrieved 2020-12-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Inner line permit regime extended to Manipur; President signs order". 2019-12-11. Retrieved 2020-12-23.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  10. "Entry Permit | Lakshadweep | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-13.
  11. No need for ‘Inner Line Permit’ for domestic tourists visiting Leh"No need for 'Inner Line Permit' for domestic tourists visiting Leh - Hindustan Times". Archived from the original on 2014-08-08. Retrieved 2014-07-30.
  12. "Ladakh Removes Inner Line Permit Restrictions for Tourists". News18 (in ఇంగ్లీష్). 2021-08-06. Retrieved 2021-08-07.
  13. "Massive rally in Shillong backs ILP - Thousands gather at students' field to support cause". www.telegraphindia.com.