Jump to content

ఇంద్రవెల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°29′40″N 78°40′13″E / 19.494347°N 78.670163°E / 19.494347; 78.670163
వికీపీడియా నుండి
ఇంద్రవెల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°29′40″N 78°40′13″E / 19.494347°N 78.670163°E / 19.494347; 78.670163
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం ఇంద్రవెల్లి (కె)
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,506
 - పురుషులు 23,592
 - స్త్రీలు 23,914
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.46%
 - పురుషులు 63.88%
 - స్త్రీలు 35.54%
పిన్‌కోడ్ 504346

ఇంద్రవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] ఇంద్రవెల్లి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు

[మార్చు]
2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2001 లెక్కల ప్రకారం ఇంద్రవెల్లి మండల జనాభా 38642. ఇందులో పురుషుల సంఖ్య 19045, మహిళలు 19597. షెడ్యూల్ కులాలవారు 4666, షెడ్యూల్ తెగల వారు 23361 మంది ఉన్నారు. మండల జనాభాలో 60% పైగా షెడ్యూల్ తెగల వారున్నారు.[3]

2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషుల సంఖ్య 23602, మహిళలు 23833. అక్షరాస్యుల సంఖ్య 25139. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 208 చ.కి.మీ. కాగా, జనాభా 39,781. జనాభాలో పురుషులు 19,733 కాగా, స్త్రీల సంఖ్య 20,048. మండలంలో 8,262 గృహాలున్నాయి.

వ్యవసాయం, పంటలు

[మార్చు]

ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10646 హెక్టార్లు, రబీలో 534 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]

ఇంద్రవెల్లి ఆనాటి సంఘటనలు

[మార్చు]
1981లో ఏప్రిల్ 20న పోలీసు కాల్పుల్లో ఎంతో మంది ఆదివాసీలు మరణించారు. వారి స్మృతిలో నిర్మించిన స్థూపం

1981, ఏప్రిల్ 20: పోలీసు కాల్పులలో అనేక మంది గిరిజనులు మరణించారు. దానికి గుర్తుగా గ్రామంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది.[5]

ప్రభుత్వ కార్యాలయాలు:

  • గ్రామ పంచాయతీ కార్యాలయం
  • మండల తహశీల్దార్ కార్యాలయం
  • ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం
  • పోలీస్ స్టేషన్
  • పశు వైద్యశాల
  • అటవీశాఖ కార్యాలయం
  • మండల ఐ.కె.పి. కార్యాలయం
  • మండల విద్యా శాఖ కార్యాలయం
  • వ్యవసాయ మార్కెట్ కార్యాలయం

మండలానికి చెందిన కొన్ని విషయాలు

[మార్చు]
  • గ్రామపంచాయతీలు: 15
  • చెరువులు: 7
  • పోస్టాఫీసులు: 10
  • బస్ స్టాపులు: 10
  • రైల్వేస్టేషన్లు: లేవు
  • గ్రంథాలయాలు: 2

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అయితే తరువాత ఆదిలాబాదు జిల్లా, సిరికొండ మండల పరిధిలో ఉన్న మల్లాపూర్, ధర్మసాగర్ అనే రెండు గ్రామాలు ఈ మండలంలో చేర్చారు.[6][7] వాటితో కలుపుకని ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  • మార్కగూడ (ఇంద్రవెల్లి బి)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. Statistics Book of Adilabad, 2004-05
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 111
  5. మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ 108
  6. "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2022-04-27.
  7. Singh, S. Harpal (2019-03-08). "Mallapur, Dharmasagar repatriated to Indervelli". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-27.

వెలుపలి లంకెలు

[మార్చు]