ఆరిలోవ
అరిలోవ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°46′05″N 83°18′36″E / 17.767921°N 83.310008°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC 5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530040 |
Vehicle registration | ఏపి 31, ఏపి 32, ఏపి 33 |
అరిలోవ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలోని ఒక నివాస ప్రాంతం.[1] ఇది నగరానికి ఉత్తరం వైపున ఉంది. కైలాసగిరి పక్కనున్న ఈ ప్రాంతానికి ఎదురుగా కొండలు ఉన్నాయి. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.
ఈ ప్రాంతం ప్రధానంగా మధ్యతరగతి ప్రజల నివాస కేంద్రంగా ఉంది. ఇది తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడికి చుట్టుపక్కల అనేక ఆసుపత్రులు ఉండడం వల్ల దీనిని విశాఖపట్నం ఆరోగ్య నగరం అని కూడా పిలుస్తారు.
భౌగోళికం
[మార్చు]ఇది 17°46′05″N 83°18′36″E / 17.767921°N 83.310008°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.
ప్రాంతాలు
[మార్చు]కైలాస్ నగర్, శ్రీహరి నగర్, అరిలోవ కాలనీ, దుర్గానగర్, టిఐసి పాయింట్, అంబేద్కర్ నగర్, పార్వతి నగర్, అప్సర కాలనీ, ముస్తఫా కాలనీ, బాలాజీ నగర్, తోటగరువు మొదలైన నివాస ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్, ముదసర్ లోవ రిజర్వాయర్ ఈ ప్రదేశానికి సమీపంలో ఉన్నాయి. హనుమంతువాక, కైలాసగిరి, ఎంవిపి, వెంకోజిపాలెం ఇక్కడికి చుట్టూ ఉన్నాయి.
ఆస్పత్రులు
[మార్చు]విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్), ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, జిమ్స్ హాస్పిటల్, పిన్నకిల్ హాస్పిటల్స్, ఎంబి హాస్పిటల్, మధుమేహ ఆసుపత్రులు మొదలైనవి అరిలోవకు సమీపంలో ఉన్న ప్రధాన ఆసుపత్రులు. అరిలోవను విశాఖపట్నం ఆరోగ్య నగరం అని కూడా పిలుస్తారు.[2]
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరిలోవ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3]
బస్సు సంఖ్య | ప్రారంభం | ముగింపు | వయా |
---|---|---|---|
60సి | అరిలోవ కాలనీ | ఓల్డ్ హెడ్ పోస్టాఫీసు | అరిలోవ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్ |
60ఆర్ | అరిలోవ కాలనీ | రామకృష్ణ బీచ్ | అరిలోవ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
69 | అరిలోవ కాలనీ | రైలు నిలయం | అరిలోవ, హనుమంతువాక, వెంకోజీపాలెం, సీతమ్మధార, సత్యం జంక్షన్, గురుద్వార్, ఆర్టీసీ కాంప్లెక్స్ |
68కె/68 | కొత్తవలస/సింహాచలం | ఆర్కే బీచ్ | పెందుర్తి, వేపగుంట, సింహాచలం, అడవివరం, అరిలోవ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
60 | సింహాచలం | పాత హెడ్ పోస్ట్ ఆఫీస్ | అడవివరం, అరిలోవ, హనుమంతువాక, మద్దెలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Arilova, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 3 May 2021.
- ↑ "Visakhapatnam: ESIC Hospital to be shifted". Deccan Chronicle. 2017-11-23. Retrieved 3 May 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.