అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Ammonium hexachloroplatinate(IV)
| |
ఇతర పేర్లు
ammonium chloroplatinate
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [16919-58-7] |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:59604 |
SMILES | [NH4 ].[NH4 ].Cl[Pt-2](Cl)(Cl)(Cl)(Cl)Cl |
| |
ధర్మములు | |
(NH4)2PtCl6 | |
మోలార్ ద్రవ్యరాశి | 443.87 g/mol |
స్వరూపం | yellow crystals |
వాసన | odorless |
సాంద్రత | 3.065 g/cm3 |
ద్రవీభవన స్థానం | 380 °C (716 °F; 653 K) decomposes |
0.289 g/100ml (0 °C) 0.7 g/100ml (15 °C)[1] 0.499 g/100ml (20 °C) 3.36 g/100ml (100 °C) | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ఒక రసాయన సంయోగ పదార్థం. అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. ఈ సంయోగ పదార్థాన్ని అమ్మోనియం క్లోరోప్లాటినేట్ అనికూడా వ్యవహరిస్తారు. ఈ రసాయన పదార్థం యొక్క రసాయన సంకేత పదం (NH4)2[PtCl6]. ఇది నీటిలో పసుపురంగు ద్రావణాన్ని ఏర్పరచును. ఒక మొలారిటి అమ్మోనియం క్లోరైడ్(NH4Cl) లో అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ యొక్క ద్రవణీయత కేవలం 0.0028 గ్రాములు/100 మి.లీ. ఇది ఆర్ద్రతాకర్షణ లేని రసాయన సంయోగపదార్థం.
భౌతిక ధర్మాలు
[మార్చు]భౌతిక రూపం
[మార్చు]అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ వాసన లేని ,పసుపురంగులో ఉన్న స్పటికాకృతికల్గి ఘనస్థితిలో ఉండు రసాయన సంయోగ పదార్థం. అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ యొక్క అణుభారం 443.87 గ్రాములు/మోల్,[2] అర్ద్రాతాకర్షణ కల్గిన రసాయన సంయోగ పదార్థం.[3]
సాంద్రత
[మార్చు]అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ రసాయన సంయోగ పదార్థం సాంద్రత 3.065(3.07) గ్రాములు/సెం.మీ3[3]
ద్రవీభవన ఉషోగ్రత
[మార్చు]అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ రసాయన సంయోగపదార్థం యొక్క ద్రవీభవన స్థానం 380 °C (716 °F; 653K),ఈ ఉష్ణోగ్రత దగ్గర అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ వియోగం పొందును.
ద్రావణీయత
[మార్చు]నీటిలో అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ద్రావణీయత కల్గినను అది, పరిమిత స్వల్ప ప్రమాణంలో మాత్రమే కల్గి ఉన్నది. 100 మి.లీ పరిమాణం ఉన్న నీటిలో 0 °C వద్ద 0.289గ్రాములు,15 °C వద్ద 0.7 గ్రాములు,20 °C దగ్గర 0.499గ్రాములు,100 °C వద్ద 3.36 గ్రాములు కరుగును.
రసాయన చర్యలు
[మార్చు]హైడ్రోజన్ వాయు ప్రవాహం (stream of hydrogen )లో 200 °C వద్ద అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ను వేడి చేయడం వలన ప్లాటినం స్పాంజి ఏర్పడును. దీనిని క్లోరిన్ వాయువుతో చర్య నొందించడం వలన H2PtCl6 ఏర్పడును.
ఉత్పత్తి
[మార్చు]అమ్మోనియం హెక్సాక్లోరో ప్లాటినేట్ సంయోగ పదార్థం టెట్రాహెడ్రల్ అమ్మోనియం కేటాయానులు,ఆక్టాహెడ్రల్[PtCl6]2− అనయానులను కల్గి ఉండును. హెక్సాక్లోరోప్లాటినిక్ ఆమ్లద్రవంతో అమ్మోనియం లవణాన్ని చర్య నొందించడం ద్వారా మొత్తాన్ని చూర్ణంవంటి అమ్మోనియం హెక్సాక్లోరో ప్లాటినేట్‌ను అవక్షేపంగా పొందటం జరుగును. ఈ సంక్లిష్ట సంయోగ పదార్థం అతితక్కువ/అధమ ద్రావణియత కల్గి ఉన్నందున, ఖనిజాలనుండి, రిసైకిల్డ్ శేషపదార్థాల నుండి ప్లాటినంను వేరుచేయుటకు ఈ విధానాన్ని అనుసరిస్తారు.
ఉపయోగాలు
[మార్చు]అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్ ను ప్లాటినం ప్లేటింగు లో ఉపయోగిస్తారు.అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్,రసాయనంCu(OAc)2మరియు హైడ్రోజన్ సల్ఫైడ్(H>2S తో చర్య వలనCu2PtIIPt3IVS8ను ఉత్పత్తి చేయును.ఈఈ ఉత్పాదికాన్ని డయా మాగ్నెటిక్ పదార్థాలలో,సెమి కండక్టరులలో ఉపయోగిస్తారు.[4]
మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "ammonium hexachloroplatinate(IV)". Chemister.ru. 2007-03-19. Retrieved 2014-06-03.
- ↑ "Ammonium Hexachloroplatinate(IV)". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2016-04-06.
- ↑ 3.0 3.1 "Ammonium chloroplatinate". chemicalbook.com. Retrieved 2016-04-06.
- ↑ "Ammonium hexachloroplatinate(IV)". sigmaaldrich.com. Retrieved 2016-04-06.