Jump to content

అభినేత్రి

వికీపీడియా నుండి
అభినేత్రి
దర్శకత్వంఎ. ఎల్. విజయ్
స్క్రీన్ ప్లేఎ. ఎల్. విజయ్
కథఎ. ఎల్. విజయ్
నిర్మాతఎంవీవీ సత్యనారాయణ - తెలుగు
తారాగణం
  • ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌,
ఛాయాగ్రహణంమనీష్‌ నందన్‌
కూర్పుఆంటోనీ,
సంగీతంత‌మ‌న్‌, జి.వి.ప్రకాష్‌
విడుదల తేదీ
7 అక్టోబరు 2016 (2016-10-07)
సినిమా నిడివి
140 minutes
భాషతెలుగు
బడ్జెట్50 crore (US$6.3 million)
బాక్సాఫీసు100.5 crore (US$13 million)

అభినేత్రి 2016 తెలుగు సినిమా. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని ఎ. ఎల్. విజయ్ అందించాడు. ఈ సినిమాలో ప్రభుదేవా నటీంచాడు. ఈ సినిమాకి త‌మ‌న్‌, జి.వి.ప్రకాష్‌ సంగీతాన్ని సమకూర్చాడు. త‌మ‌న్నా, సోనూసూద్‌ ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సినిమా, బ్లూ స‌ర్కిల్ కార్పొరేష‌న్‌, బి.ఎల్.ఎన్. సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి మనీష్‌ నందన్‌ఛాయాగ్రాహకుడు.[1]

కృష్ణ (ప్రభుదేవా) తను పుట్టింది రాజమండ్రి దగ్గర గా వేటపాలెం ప్రాంతంలో, ఓ ప్రైవేట్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. అత‌నికి తండ్రి అంటే భ‌యం. త‌న బామ్మ ఆఖ‌రి కోరిక తీర్చడానికి దేవి(త‌మ‌న్నా)ను పెళ్లి చేసుకుంటాడు. త‌న‌తో పాటు ముంబైకి తీసుకువెళ్ళుతాడు. ముంబై లో ఉద్యోగం చేసే కృష్ణ (ప్రభుదేవా) అందంలో, వ్యక్తిగతంగా మోడ్రన్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కాని కొన్ని పరిస్థితులతో కుటుంబపరమైన ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి అమ్మాయి దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తాను పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే పరువు పోతుందనే భయంతో పెళ్లి విషయం ఎవరికీ తెలియనివ్వడు. దేవిని ఎలాగైన ఒప్పించి ఊరికి పంపించాలనుకుంటున్న కృష్ణ, ఆమె ప్రవర్తనలో మార్పును గమనిస్తాడు. తాము ఉంటున్న ఇంట్లో అంతకు ముందు రూబి(తమన్నా) అనే అమ్మాయి ఉండేదని, సినిమా హీరోయిన్ అవ్వాలనే కోరిక తీరక మరణించిందనే విషయం తెలుస్తుంది. దేవి ప్రవర్తనలో మార్పు కారణం రూబీ ఆత్మ ఆమెలో చేరడమే అని తెలుసుకుని షాకవుతాడు. దేవి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ తన కోరికను నేరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమె స్టార్‌ హీరో రాజీవ్‌(సోనూసూద్‌) కంట్లో పడుతుంది. రాజీవ్ దేవిని ఇష్టపడుతుంటాడు. ఆత్మ నుండి, రాజీవ్ నుండి కృష్ణ తన భార్యను ఎలా కాపాడుకున్నాడ??ు సినిమాల్లో హీరోగా న‌టించే రాజ్ ప్రేమించిన రూబీ(త‌మ‌న్నా) ఎవ‌రు? రూబీ ఇంత‌కీ రాజ్ ప్రేమ‌ను అంగీక‌రించిందా? దేవికి, రూబీకి ఉన్న సంబంధం ఏంటి? రూబీ కోరిక ఏంటి? దాన్ని కృష్ణ ఎలా తీర్చాడు? రూబీతో కృష్ణ చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? అనేదే మిగతా కథ సారాంశం.

నటులు

[మార్చు]

మరిన్ని విశేషాలు

[మార్చు]

తమ‌న్నా న‌టించిన త్రిభాషా చిత్రం `అభినేత్రి`. ప్రభుదేవా హీరోగా న‌టించారు. ఇందులో సోనూసూద్‌ కీల‌క పాత్ర పోషించారు. `మ‌ద‌రాసుప‌ట్టణం`, `నాన్న` వంటి సినిమాల‌ను తీసిన విజ‌య్ ద‌ర్శక‌త్వం వహించారు. సోనూసూద్ ఈ చిత్రం క‌థ న‌చ్చి హిందీ వెర్షన్‌కి నిర్మాత‌గా మారారు. ప్రభుదేవా త‌మిళ వెర్షన్‌ను నిర్మించారు.

సంగీతం

[మార్చు]

ఈ సినిమాకి త‌మ‌న్‌, జి.వి.ప్రకాష్‌ సంగీతాన్ని సమాకుర్చారు

విడుదల

[మార్చు]

ఈ సినిమా అక్టోబర్ 7 2016 న విడుదల అయ్యింది.

వసూళ్ళు

[మార్చు]

ఈ సినిమాని 50కోట్లతో నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లను వసూలు చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "అభినేత్రి రివ్యూ". ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Archived from the original on 10 అక్టోబరు 2016. Retrieved 29 March 2018.