Jump to content

అజిత్ పాల్ సింగ్

వికీపీడియా నుండి
అజిత్ పాల్ సింగ్
వ్యక్తిగత వివరాలు
పూర్తి పేరు అజిత్ పాల్ సింగ్
జననం మూస:Birthdate and age
సంసార్పూర్, పంజాబ్
ఎత్తు 5 అ. 10 అం. (1.78 మీ.)[1]
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
2009లో సభ్యులతో అజిత్ పాల్ సింగ్

అజిత్ పాల్ సింగ్ (జననం: ఏప్రిల్ 1, 1947)[2] పంజాబ్ కు చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ హాకీ జట్టు మాజీ నాయకుడు. 1970 లో ఆయనకు అర్జున అవార్డు వచ్చింది. 1975లో మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన ప్రపంచ కప్ హాకీ పోటీల్లో భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు.

1968 నుండి 1976 వరకు మూడు ఒలంపిక్ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్నాడు. అందులో మొదటి రెండు సార్లు భారత్ కు కాంస్య పతకం లభించింది.[3]

బాల్యం

[మార్చు]

అజిత్ పాల్ సింగ్ పంజాబ్ లోని జలంధర్ కంటోన్మెంట్ సమీపాన ఉన్న సంసార్ పూర్ అనే గ్రామంలో ఏప్రిల్ 5, 1947న జన్మించాడు. ఈ గ్రామం హాకీకి పేరు గాంచింది. ఈ ఊరు నుంచే అనేకమంది హాకీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఏడెనిమిది సంవత్సరాల వయసు నుండే అజిత్ తన మామ ప్రోత్సాహంతో హాకీ స్టిక్ చేతపట్టుకున్నాడు. కంటోన్మెంట్ బోర్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివాడు. పదహారేళ్ళ వయసులో 1963 లో పాఠశాలల తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అతను మొదట్లో ఫుల్ బ్యాక్ స్థానంలో ఆడేవాడు. 1964లో కళాశాల విద్య కోసం జలంధర్ లో లియాల్పూర్ ఖల్సా కాలేజీకి మారాడు. అక్కడ గడిపిన నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు పంజాబ్ విశ్వవిద్యాలయపోటీల్లో తన కాలేజీకి విజయం సాధించి పెట్టాడు. అప్పుడే ఫుల్ బ్యాక్ స్థానం నుంచి సెంటర్ హాఫ్ స్థానానికి మారాడు. 1966 లో పంజాబ్ విశ్వవిద్యాలయం హాకీ జట్టుకి నాయకుడిగా వ్యవహరించాడు. 1968లో భారతీయ విశ్వవిద్యాలయ పోటీల్లో కూడా పాల్గొన్నాడు.

పురస్కారాలు

[మార్చు]

క్రీడారంగంలో ముఖ్యంగా హాకీ క్రీడకు అతను అందించిన సేవలకు గాను అజిత్ పాల్ సింగ్ కు 1970 లో అర్జున పురస్కారం లభించింది. 1992 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. [4]

మూలాలు

[మార్చు]
  1. "Player's Profile". Archived from the original on 2011-02-22. Retrieved 2016-07-31.
  2. "Sikh-History.com". Archived from the original on 16 సెప్టెంబరు 2015. Retrieved 28 September 2015.
  3. "Ajitpal Singh". Archived from the original on 2011-02-22. Retrieved 2016-07-31.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.