Commons:వికీ లవ్స్ ఫోక్లోర్ 2024
వికీ లవ్స్ ఫోక్లోర్ అనగా వికీమీడియా కామన్స్ వారు ఏటా నిర్వహించబడే అంతర్జాతీయ ఫోటోగ్రాఫిక్ పోటీ, దీనిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని జానపద సంస్కృతులను డాక్యుమెంట్ చేయడానికి నిర్వహిస్తారు. వికీ లవ్స్ ఫోక్లోర్ 2024 అనేది జానపద సంస్కృతి ఇతివృత్తంతో వికీ లవ్స్ ఫోక్లోర్ 2023 కొనసాగింపు. ఈ ప్రాజెక్టు మూలం 2018లో వికీ లవ్స్ లవ్ 2019 నుండి నుండి ప్రారంభమైంది
ఈ ఫోటోగ్రఫీ పోటీ జానపద పండుగలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద కార్యకలాపాలు, జానపద ఆటలు, జానపద వంటకాలు, జానపద దుస్తులు, జానపద కథలు, సంప్రదాయాలు వంటి వర్గాలపై వివిధ ప్రాంతాల జానపద సంస్కృతిపై దృష్టి సారించింది. వీటితోపాటు జానపద కథలు, అద్భుత కథలు, ఇతిహాసాలు, సాంప్రదాయ పాటలు మరియు నృత్యాలు, జానపద నాటకాలు, ఆటలు, కాలానుగుణ సంఘటనలు, క్యాలెండర్ ఆచారాలు, జానపద కళలు, జానపద మతం, పురాణాలు మొదలైన ఫోటోలు చేర్చొచ్చు. కొన్ని ఉదాహరణలను ఈ వర్గంలో చూడవచ్చు.
దేశ జానపద సంస్కృతి, జానపద కళలు, చైనీయుల అదృష్టాన్ని చెప్పే కళ, జానపద నృత్యం, యూరోప్యాడ్, జానపద పండుగలు, జానపదాలు, జానపద ఆటలు, గవారి, జానపద సమూహాలు, జానపద మాయాజాలం, జానపద సంగ్రహాలయాలు, జానపద సంగీతం, న్యూవెల్లింగ్, జానపద మతం, సాంప్రదాయ సంగీతం, సాంప్రదాయ పాటలు జానపద కుస్తీ.
బహుమతులు
* మొదటి బహుమతి: ₹33227 రూపాయలు
- రెండవ బహుమతి: ₹24920 రూపాయలు
- మూడవ బహుమతి: ₹8300 రూపాయలు
- మొదటి 10 బహుమతులు: ₹4153 రూపాయలు
- ఉత్తమ వీడియో బహుమతి మరియు ఉత్తమ ఆడియో బహుమతి: చరి ₹4153 రూపాయలు
- ఎక్కువ చిత్రాలు చేర్చిన వారికి బహుమతి: మొదటి బహుమతి: ₹24920 రూపాయలు, రెండవ బహుమతి: ₹12460 రూపయలు
- టాప్ ₹100 అప్‌లోడర్లకు ఫోక్లోర్ పోస్ట్‌కార్డ్‌లను ఇస్తారు
- స్థానిక నిర్వాహకులకు ధృవపత్రాలు మరియు పోస్ట్‌కార్డులు
కాలక్రమం
వికీ లవ్స్ ఫోక్లోర్ 2024లో ఈ విధంగా ఉంది
- ఫిబ్రవరి 1 - 31 మార్చి, 2024
- పోటీ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2024 00:01 (UTC)
- పోటీ గడువు: మార్చి 31, 2024 23:59 (UTC)
- ఫలితాల ప్రకటన: దాదాపు జూలై 15, 2024
మేము వేటిని అంగీకరించము
మేము క్రింద చెప్పిన మీడియాను అంగీకరించము:
- కామన్స్ ప్రాజెక్ట్ పరిధిలోకి రానివి.
- EXIF సమాచారం లేనివి.
- అధికంగా ప్రాసెస్ చేయబడినవి మరియు డిజిటల్‌గా మార్చబడినవి.
- అశ్లీల మరియు స్పష్టమైన చిత్రాలు.
- కాపీరైట్ సమస్యలు మొదలైన వాటి కారణంగా కళాకృతులు.
మమ్మల్ని సంప్రదించండి
ఈ విధంగా మమ్మల్ని సంప్రదించండి
- మాకు వ్రాయడానికి చర్చా పేజీ.
- మాకు ఈ-మెయిల్ వ్రాయండి supportwikilovesfolklore.org
- వీటి ద్వారా మాతో మాట్లాడొచ్చు ట్విట్టర్, ఫేస్బుక్(మెటా) or ఇన్‌ష్టాగ్రామ్
జానపద వ్యక్తులు మరియు కార్యకలాపాలు
జానపద వంటకాలు
జానపద నృత్యాలు
జానపద పండుగలు
జానపద సంగీతం
జానపద దుస్తులు
వికీ లవ్స్ ఫోక్లోర్ జరుగుతున్న సమయంలో, 1 ఫిబ్రవరి 2024 నుండి 31 మార్చి 2024 వరకు ఫెమినిజం మరియు ఫోక్లోర్ 2024 వ్రాతపోటీ కూడా ఉంటుంది. స్త్రీవాదం, మహిళల జీవిత చరిత్రలు, లింగ-కేంద్రీకృత అంశాలపై కథనాలను సృష్టించండి లేదా విస్తరించండి. మీ స్థానిక భాష పోటీలో ఇప్పుడే పాల్గొనండి .